పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఐ నాయకులు బాలరాజు, రైతుసంఘం నాయకులు సత్యన్న డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయ కులు తిమ్మగురుడు, ఖాజా, కృష్ణ. శివ, మల్లి, ఉరుకుందు, నరసన్నగౌడ్, వెంకటేష్, వీరేంద్రగౌడ్ పాల్గొన్నారు.