రాజమహేంద్రవరం నగరంలోని దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గైట్ ఇంజనీరింగ్ కళాశాల్లో చదువుతున్న ముంగర జాన్ బాబు (21) మృతిచెందాడని బొమ్మూరు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా పైడిచింతపాడు గ్రామానికి చెందిన జాన్‌బాబు దివాన్‌చెరువులో ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్‌లో ఉంటూ రాజానగరం గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. గురువారం సాయంత్రర బైక్‌పై స్నేహితుడితో కలిసి రాజమహేంద్రవరం వచ్చి రాత్రి తిరిగి వెళుతున్న క్రమంలో దివాన్‌చెరువు జీరో పాయింట్ వద్ద ఒక లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో జాన్‌బాబు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని స్థానికులు 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసు పత్రికి తరలించారు. అయితే శుక్రవారం జాన్‌బాబు మృతిచెందాడు. ఈమేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.