ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 13వ తారీకు జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల కు సంబంధించి తమ ప్రధాన ఓటు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కి వేసి అమూల్యమైన మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మారం వెంకట్ రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస రెడ్డి, కోఆప్షన్ నెంబర్ కరిముల్లా నాకు బొట్లపాలెం సర్పంచ్ సుబ్బారావు తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa