గుంటూరు ట్రాఫిక్ సమస్యలపై, ట్రాఫిక్ దృష్ట్యా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధికారులకు శనివారం ఆదేశించారు. గుంటూరులోని పలు ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటుకై నగరంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, ఈ. ఈ సుందర రామిరెడ్డి, డి. ఈ. ఈరమేష్ బాబు, స్థానిక పెద్దలు చల్లా ప్రసాద్ రావు, చల్లా శివప్రసాద్ పాల్గొన్నారు.