చిలకలూరిపేట: మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తుల కారణంగా మార్చి 9, 10 తేదీలలో మంచినీటి సరఫరా నిలుపుదల చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సి. హెచ్ గోవిందరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపాస్ రోడ్డు పనుల నిమిత్తం మంచినీరు సరఫరా చేసే పైప్ లైన్ల అలైన్ మెంట్ మార్పు, ఇంటర్ కనెక్షన్లు చేయాల్సి ఉన్నందున రెండు రోజులు పట్టణ ప్రజలకు మంచినీరు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించాలన్నారు.