సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో శనివారం రాత్రి అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన కూరి ప్రతాప్ రెడ్డి ఎకరన్నర సొంత పొలంతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప సాగు చేశాడు. పంట సరిగా పండక రూ. 10 లక్షలు అప్పు అవడంతో పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఘటనపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.