దేశంలో మరోసారి కరోనా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 300పైగా కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమైనట్లు తెలుస్తోంది. భారత్లో కరోనా కేసులు ఇప్పటి వరకూ 4,46,86,361కు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువైనట్లు ICMR ప్రకటించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.