ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీని భూప్రకంపనలు వణికించాయి. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం వచ్చింది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 12.45 గంటలకు మరోసారి, అనంతరం 1.01 గంటలకు మూడోసారి భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. 2.5 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు.