ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామంలోని నేతగాని మాలపల్లిలో ఇదేం ఖర్మ కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. క్లస్టర్ ఇంఛార్జి గుత్తికొండ ప్రసాద్, బూత్ కన్వీనర్ కుమ్మరి నంచారాయ్య, రెబ్బ సుబ్బారావు, నాగార్జున, హేమంత్, కుమ్మరి రాంబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొని వైసిపి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.