మదనపల్లె రూరల్ మండలం కోళ్లబైలు వాటర్ ఫాల్స్ వద్ద దారుణహత్యకు గురైన గుర్తుతెలియని యువకునికి రూరల్ పోలీసులు శనివారం డాక్టర్లతో స్పాట్ పోస్ట్ మార్టం చేయించారు. సుమారు 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య కు గురైన సంగతి తెలిసిందే. ఘటన స్థలాన్ని శనివారం సీఐ సత్య నారాయణ, ఎస్ఐ చంద్రశేఖర్ పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కీలక ఆధారాలతో నాలుగు పోలీస్ బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.