ఎలమంచిలి: ఒక్కగానొక్క కొడుకు. ప్రస్తుతం వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబానికి ఆసరాగా నిలిచిన కొడుకు దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. తమకు తలకొరివి పెట్టాల్సిన కొడుకు ఇలా అర్థాంతరంగా తనువుచాలిస్తాడని ఊహించలేదని తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం. మునగపాక మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఏదూరి గోవింద్ (23) వాలంటీరుగావిధులు నిర్వహిస్తున్నారు. నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న కల్యాణం తిలకించేందుకు శుక్రవారం రాత్రి మిత్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన ఇతని అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించి అక్కడి నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రీకి తారీలిస్తుండగా మృతి చెందాడు. అందిచ్చిన కొడుకు మృతిచెందడంతో గోవింద తల్లిదండ్రులు ఏదూరి రమణమ్మ, రమణ కన్నీరుమున్నీరుగా విలపి స్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే వాలంటీర్ మృతిచెందాడన్న విషయం తెలియంతో గ్రామంలో విషాదఛా యలు అలుముకొన్నాయి.