నైతిక విలువలు గల విద్యావంతులు సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన వారు పరస్పర సహకారంతో నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని రాజమండ్రి నగర ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అత్తిలి రాజు పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ సమాజంలో విద్యావంతులైన పౌరులు 10% మాత్రమే ఉన్నారని అన్నారు. దానివల్లే సంక్షేమ నినాదాలు, మోసపూరిత ప్రలోభాలతో నిరక్షరాస్యులు చేసే రాజకీయాలు విజయవంతం అవుతున్నాయన్నారు.