సగటు వేతన జీవులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి మార్చి నెల చాలా ముఖ్యం. ఈ నెలతోనే ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు పన్ను మినహాయింపులు కల్పించే పెట్టుబడుల కోసం చూస్తుంటారు చాలా మంది. వాటితో పాటు మార్చి 31 పాన్-ఆధార్ లింక్ చేయటానికి చివరి తేదీ. అప్పటిలోపు చేసుకోకపోతే మార్చి 31 తర్వాత నుంచి 10 వేల ఫైన్ విధింపు ఉంటుందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది.