గుంటూరు: వైయస్సార్ పెన్షన్ కానుక పథకంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ గడువు నేటితో ముగియనుంది. గుంటూరు జిల్లాలో ప్రతినెల 1 నుంచి 4వ తేదీలో 2, 49, 933 మందికి రూ. 68. 66 కోట్ల పెన్షన్ నగదును వాలంటీర్ల ద్వారా అందజేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. మరో 3, 304 మందికి రూ. 93 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతి నెలలో 5వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గడువు విధించింది.