గుంటూరు: మార్చి 15 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో జేసీ జి. రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ థియరీ పరీక్షలకు 73 కేంద్రాల్లో 58, 602 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. మొదటి ఏడాది 29, 873 మంది (సాధారణ 28, 833 మంది కాగా, వృత్తి విద్య 1, 040 మంది), ద్వితీయ ఏడాది 28, 729 మంది (సాధారణ 27, 683, వృత్తి విద్య 1046) విద్యార్థులు హాజరవుతున్నానన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే కంట్రోల్ రూం ఫోన్‌నంబరుకు. 0863- 2228528 కు తెలియజేయవచ్చన్నారు.