తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని యోగుల పర్వతం గత రెండు రోజులుగా అగ్నికి ఆహుతి అవుతోంది. ఎండాకాలం కావడంతో చెట్లు అన్ని ఎండిపోవడంతో ఆకులు అంతా రాలిపోయింది. ఎవరైన అంటించారా లేదా ప్రమాదంలో మంటలు వ్యాపించాయా అనేది తెలియాల్సి ఉంది. అడవి కాలుతున్న అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు స్థానికులు నుంచి వస్తున్నాయి.