తంబళ్లపల్లి మల్లయ్య కొండ భక్తులకు మదనపల్లి వన్ డిపో ఆర్టీసీ అధికారులు శుభవార్త తెలిపారు. ప్రతి సోమవారం మదనపల్లి నుండి తంబళ్లపల్లె మీదుగా రెండు ఆర్టీసీ సర్వీసులను మల్లయ్య కొండపైకి తిప్పుతున్నట్లు మదనపల్లి వన్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సులు ప్రతి సోమవారం మదనపల్లిలో 5 గంటలకు బయలుదేరి తంబళ్లపల్లెకు చేరుకొని మల్లయ్యకొండ- తంబళ్లపల్లె రోజంతా తిరగనున్నాయి. ఈ అవకాశాన్ని మల్లయ్యకొండ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే, ఆలయ చైర్మన్ లకు, ఆర్టీసీ అధికారులందరికీ తంబళ్లపల్లి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.