యూపీలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి హెచ్‌ఐవీ బారిన పడింది. ప్రభుత్వానికి చెందిన ఈటా అటానమస్ మెడికల్ కాలేజీలో ఏడాది వయసు పాపను చికిత్స కోసం చేర్చారు. అక్కడ హెచ్‌ఐవీ సోకిన మరో చిన్నారికి ఇంజెక్షన్ చేసిన సిరంజితోనే అక్కడ చికిత్స పొందుతున్న మిగిలిన రోగులకు కూడా సూదిమందు ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత ఆ చిన్నారికి HIV సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి విచారణకు ఆదేశించారు.