టోల్ చార్జీలను 5-10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫలితంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది. సాధారణంగా టోల్ చార్జీలను ఏడాదికోసారి సవరిస్తూ ఉంటారు. ఈ నెలాఖరు నాటికి కేంద్రం తుది నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయనుంది. దీంతో ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశముంది.