గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో గర్భిణులకు రోగనిరోధక టీకాలు 86.5% ఇవ్వగా.. ఏపీ, కర్ణాటకలో 100% టీకాలు పంపిణీ చేశారు. అలాగే 100% పిల్లలకు పోలియో చుక్కలు అందించింది ఏపీ ప్రభుత్వం. హైపటైటిస్-బి డోసులకు సంబంధించి జాతీయ సగటు 75.8% కాగా ఆంధ్రప్రదేశ్‌లో 98.4% ఉంది. ఆస్పత్రుల్లో ప్రసవాల జాతీయ సగటు 95.5% కాగా, ఏపీలో 99.9% ఉంది.