రోడ్డుజాగ్రత్తలపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోవటమే కాకుండా అమాయకుల ప్రాణాలు సైతం బలితీసుకుంటున్నారు. 2022లో తెలంగాణలో 19,456 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 6,746 మంది చనిపోయారు. గత నాలుగేళ్లలో కేవలం రోడ్డు ప్రమాదాల ద్వారానే 26,433 మంది మరణించగా, 75,319 మంది వైకల్యం పాలయ్యారు. వీటిల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు హైవేలపైనే జరిగాయి.