మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో 15 ఏళ్ల ఓ బాలిక దారుణానికి ఒడిగట్టింది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి ద్వారా బాలిక గర్భం దాల్చింది. అనారోగ్యం వల్ల పొట్టపెరుగుదంటూ తల్లిని ఏమార్చింది. యూట్యూబ్‌లో చూస్తూ ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని వేళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బిడ్డను గొంతునులిమి చంపేసి ఇంట్లోనే ఓ పెట్టెలో పెట్టింది. తాజాగా బాలిక అనారోగ్యానికి గురికావటంతో నిలదీసిన తల్లికి నిజం చెప్పేసింది.