ఈపీఎఫ్ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO) షాక్ ఇచ్చింది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న వారికి నోటీసులిచ్చింది. సర్వీసులో ఉన్నప్పుడు అధిక వేతనంపై EPF చందా చెల్లించేందుకు, పింఛను నిధికి 8.33% వాటా చెల్లించేందుకు యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ఆధారాలను అందజేయాలని సూచించింది. లేకపోతే అధిక పింఛను మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది.