సింగనమల మండలంలోని చెరువు కట్ట కింద మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు సోమవారం అధికారులకు విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ గతంలో ఆరు నెలల నుంచి మరువ నీటితో పారుతుండడంతో ఎంతోమంది కిందపడి ప్రమాదాలకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మరువ నీరు ఎండిపోతే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని అధికారులు తెలిపారని అయితే ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.