ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలుడు ఇంట్లో తన తల్లిదండ్రులు లేని సమయాన్ని చూసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆ బాలుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మైనర్ బాలుడు ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మైనర్ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డ కారణాలు తెలియవలసి ఉందని అన్నారు.