ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటి పల్లి గ్రామంలో ఆదివారం ప్రజా సంకల్ప వేదిక కార్యక్రమాన్ని ప్రజాసంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రంగసాయి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలపై ప్రజాసంకల్ప వేదిక అలుపెరగని పోరాటం చేస్తుందని అధ్యక్షుడు రంగసాయిరెడ్డి చెప్పారు. తర్వాత స్థానిక గ్రామ ప్రజలు 200 మంది ప్రజా సంకల్ప వేదిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు ప్రజాసంకల్ప వేదికలు చేరుతున్నారని అధ్యక్షుడు రంగసాయిరెడ్డి అన్నారు.