బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం పందిళ్ళపల్లి క్రాస్ రోడ్ లో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ మినీ లారీని చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావు సోమవారం ఉదయం పట్టుకున్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు ఆయన కాపు కాసి అటుగా వస్తున్న వాహనాలు తనిఖీ చేపట్టగా ఒక మినీ లారీలో 98 రేషన్ బియ్యం బస్తాలు దొరికాయి. దీంతో వాహనాన్ని సీజ్ చేసి వేటపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ను విచారిస్తున్నారు. కాగా ఈ బియ్యం పర్చూరు నియోజకవర్గంలోని ఓ అధికార పార్టీ ఎంపీపీకి చెందిన మిల్లుకు వెళుతూ పోలీసులకు దొరికినట్టు సమాచారం వేటపాలెం సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.