రాజంపేట ఆకేపాడు ఎస్టేట్ లో రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్ తోను, రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య సభ్యులు, మరియు రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలకి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కోఆర్డినేటర్లతో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎన్నికలు సెమీఫైనల్ లాంటివని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి , నందలూరు జడ్పిటిసి గడికోట వెంకటసుబ్బారెడ్డి , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి , మరియు మున్సిపల్ కౌన్సిలర్లు, ఆరు మండలాల కోఆర్డినేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.