ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెరగాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రొద్దుటూరు స్థానిక శివాలయం వీధిలోని నందిని క్లాత్ మార్కెట్ లోని జేవివి కార్యాలయంలో జేవివి పట్టణ మహాసభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కమిటీ పనితీరును అభినందించారు. జేవివి చెకుముకి కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు. సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ విద్యార్థుల ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తున్నామన్నారు. కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు పోలంకి శ్రీరాములు, నాయకులు మురళీ గుప్త, సునీత, గోపీనాధరెడ్డి, ప్రకాశ్, అంకమ్మ, ఈశ్వరయ్య, శ్వేత, శర్వాణి, కళ్యాణ్, దస్తగిరి, హేమంత్, మీనా, తదితరులు పాల్గొన్నారు.