ఈ నెల 8వ తేదీన ఏపీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నామని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మరోసారి స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ.. గతంలోనే నిరసనలు, ప్రదర్శనలు చేస్తామని హెచ్చరించినా సీఎం జగన్ సర్కారులో చలనం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి 5 గంటలు మాత్రమే పని చేస్తామని తెలిపారు.