మామిడి పూత విరగబూయడంతో రైతులలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఎన్నడు లేని విధంగా ఆకు కనబడకుండా మామిడి చెట్లు పూత పూయడంతో మామిడి పంట అధిక దిగుబడి వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాలలో దాదాపు 24, 685 హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మామిడి పూతకు పురుగు సోకకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం మామిడి పంట అధికంగా దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.