కొమరాడ మండలం, చోళపదం గ్రామ సమీపంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు చోళపదం, సరువుడుగూడ సమీప గ్రామాల్లో తిరుగుతున్నట్లు చెబుతున్నారు. గ్రామస్తులు, రైతులు పంటపొలాలకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివిధ గ్రామాల్లో వాలంటీర్లు, గ్రామపెద్దలు దండోరా వేశారు. మిగిలిన ఏడు ఏనుగుల గుంపు పెదబుడ్డిడి, లఖనపురం పంట పొలాల్లో సంచరిస్తున్నాయి.