కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది రూ. 6 వేలు లభిస్తున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పును అందిస్తోంది. ఈ పథకంలో చేరాలంటే ఆన్ లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలం పట్టా బుక్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పినిసరి.