ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉమేశ్‌పాల్ హత్యకేసులో వారం క్రితం ఓ నిందితుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు ఇవాళ మరో నిందితుడిని కూడా ఎన్కౌంటర్ చేశారు. సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా పోలీసు స్టేషన్లో నిందితుడు ఉస్మాన్‌ను ఎన్కౌంటర్లో కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ను చంపేసిన నిందితుల్లో ఉస్మాన్ కూడా ఒకడు.