మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ యువకుడ్ని బాలిక బంధువులు చితకబాదిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బోరబండలో ఉండే బషీర్ అనే యువకుడు ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక బంధువులు ఆగ్రహంతో బషీర్ ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడ్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. బషీర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.