రాజస్థాన్ లోని రాజ్ సమంద్ జిల్లాలో ఉన్న కుంభాల్ గడ్ కోట గోడను 'ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా' అని అంటారు. ఇది ఆరావళి పర్వతాలకు పశ్చిమ శ్రేణిలో ఉంది. దీని చుట్టుకొలత 36 కి.మీ. ఈ కోట చుట్టూ 13 ఎత్తైన పర్వతాలున్నాయి. ఈ కోటను మేవాడ్ రాజు రాణా కుంభ నిర్మించాడు. 2013 లో యునెస్కో 'హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్' పేరిట పలు కోటలతో కలిపి ఈ కోటకు కూడా వారసత్వ గుర్తింపునిచ్చింది.