ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో భాగంగా సిసోడియాను సీబీఐ అధికారులు వారం రోజులపాటు ప్రశ్నించారు. సిసోడియాను ఇవాళ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి ఈ నెల 20వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సిసోడియాను సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించారు.