ప్రజలను అత్యవసర సమయంలో ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంబులెన్సులు నిర్వహణ సరిగ్గా లేక పాడవుతున్నాయి. తాజాగా ఓ ప్రభుత్వ అంబులెన్సు దగ్ధమవుతున్న వీడియో బయటికి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా ఆసుపత్రిలో అంబులెన్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారమివ్వగా, వారు వచ్చేలోపే అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa