ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది: రామ్మోహన్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 02:44 PM

 శ్రీకాళహస్తి అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తీ, తిరుమల శ్రీవారిని దర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎయిర్‌పోర్టును పరిశీలించి ఆధ్యాత్మిక ప్రదేశాలకు విమాన సర్వీసులు కల్పిస్తామని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏఐ వినియోగం కోసం ఓ టీమ్ పని చేసిందని, ఆ బృందంతోనూ చర్చలు జరుపుతామని చెప్పారు. టీటీడీ కమాండ్ కేంద్రం తమకు ఆదర్శమని మంత్రి తెలిపారు. దేశంలో విమానయాన శాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్యాసింజర్ల సమాచారమని, ఆపరేషన్లను కమాండ్ కేంద్రం నుంచి నడిపిస్తే మంచి సౌకర్యాలు ఇవ్వొచ్చన్నారు. టీటీడీ కమాండ్ కేంద్రం తమకు ఆదర్శమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa