జగనన్న విద్యాదీవెన పథకం మళ్లీ వాయిదా పడింది. గత నెల 28న విడుదల చేస్తామని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం దాన్ని ఈ నెల 7వ తేదీకి మార్చింది. తాజాగా దాన్ని మళ్లీ వాయిదా వేసినట్లు జిల్లాలకు సమాచారం పంపింది. తదుపరి తేదీని ప్రకటించలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ.700 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్ని విడుదల చేయాల్సి ఉంది.