ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఈ నెల 15వ తేదీ తరువాత పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ అవగా 1,142 పీహెచ్సీల్లో పూర్తి స్థాయిలో వైద్యుల భర్తీ చేశామని జగన్ తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామంలోనే ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని అధికారులు తెలిపారు.