వ్యాయామం చేయడం ఆరోగ్యకరమే. కానీ, ఓ పరిధిమేరకే వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.తగిన విశ్రాంతి లేకుండా అధికంగా కసరత్తులు, శ్రమ చేస్తే బరువు పెరిగే అవకాశాలున్నాయని ఓ సర్వేలో తేలింది. ఫిట్‌నెస్ అంటూ అధికంగా వర్కౌట్లు చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక వ్యాయామం వలన ఆకలి తగ్గడం, డిప్రెషన్, నిద్రలేమి, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.