మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాంగ్లీ జిల్లాలోని వాల్వాకు చెందిన ఓంకార్‌కు తన స్నేహితుడు సమ్మద్‌తో చిన్న గొడవ జరిగింది. కక్ష పెంచుకున్న సమ్మద్ ఓంకార్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 27న మరికొందరు స్నేహితులతో వచ్చి ఓంకార్‌ను కిడ్నాప్ చేసి చంపేశారు. శరీరాన్ని కాల్చి బూడిదను నదిలో పారబోశారు. మిస్సింగ్ కేసుగా విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులు నిజం చెప్పేశారు.