పెద్ద గుమ్మడాపురంలో పులి పిల్లలు దారి తప్పి ఊళ్లోకి వచ్చిన విషయం తెలిసిందే! కొత్తపల్లి మండల పరిధిలోని పెద్ద గుమ్మడాపురo గ్రామంలో రెండు రోజుల క్రితం పులి పిల్లలు కలకలం రేపాయి. గ్రామస్తులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చి పుల్లి పిల్లలను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు.
పులి పిల్లల తల్లి పెద్దపులి 24 గంటలు గడిచినా జడ తెలియకపోవడంతో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నట్లు వైద్యుల సమాచారం మేరకు మంగళవారం వాటికి పాలు, శేరీలాక్, ఐస్ క్రీమ్, ఓఆర్ఎస్, లాంటి పదార్థాలు తాపీ తినిపించే ప్రయత్నం చేయగా పులి పిల్లలు వాటిని తినలేదు.ఎండ తీవ్రతకు మరింతగా నిరసించాయని అటవీ అధికారులు తడిగుడ్డలతో వాటికి ఉపశమనం కలిగించినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్, అలాన్ చాంగ్ తెలిపారు.