వయసుతో సంబంధం లేకుండా గుండె పాటుతో అనేకమంది మృత్యువాత పడుతున్నారు. సినీ ప్రముఖులు, కొంతమంది వ్యాయామం చేస్తూ మరి కొంతమంది హఠాత్తుగా అతి చిన్న వయసులోనే గుండె పోటుతో ఇటీవల కాలంలో మృతి చెందుతున్నారు. చిలకలూరిపేట పట్టణం పసుమరు కు చెందిన షేక్ ఫిరోజ్ (17) విద్యార్థి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఫిరోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలానే రాత్రి భోజనం చేసి నిద్రిస్తుండగా రెండు గంటల సమయంలో గుండె నొప్పి ఉందని కేక వేయడంతో అతన్ని ఒక ప్రైవేట్ ఆస్పత్రి తీసుకువెళ్లగానే దారిలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాంగ్లీ జిల్లాలోని వాల్వాకు చెందిన ఓంకార్‌కు తన స్నేహితుడు సమ్మద్‌తో చిన్న గొడవ జరిగింది. కక్ష పెంచుకున్న సమ్మద్ ఓంకార్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 27న మరికొందరు స్నేహితులతో వచ్చి ఓంకార్‌ను కిడ్నాప్ చేసి చంపేశారు. శరీరాన్ని కాల్చి బూడిదను నదిలో పారబోశారు. మిస్సింగ్ కేసుగా విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులు నిజం చెప్పేశారు.