నాతవరం మండలం తాండవ జంక్షన్ సమీపంలో గల జీడితోటలో గుర్తుతెలియని ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం రావడంతో తాము ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి వయసు 60 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఆచూకీ తెలిస్తే తెలియాలన్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని భద్రపరుస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa