పుట్టపర్తి పట్టణంలోని సత్యసాయి మహాసమాధిని మారిషస్ విదేశాంగ మంత్రి ఆలెన్గాను దర్శించుకున్నారు. సోమవారం బెంగళూరు నుంచి వాహనంలో ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సాయికుల్వంత్ మందిరంలో మహాసమాధిని దర్శించుకున్న అనంతరం ఆయన ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు ఆర్. జె. రత్నాకర్‌ను కలిశారు. ట్రస్టు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను రత్నాకర్ వివరించారు. దిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు భారత్‌కు వచ్చినట్లు ఆలెన్గాను తెలిపారు. 1985 నుంచి సత్యసాయి దర్శనార్థం పుట్టపర్తికి వస్తున్నానని, ప్రపంచంలో ఎక్కడా లభించని మానసిక ప్రశాంతత మందిరంలో లభిస్తోందన్నారు. బెంగళూరుకు తిరిగి వెళ్లారు.