అక్రమంగా చౌకధాన్యం బియ్యంను తరలిస్తున్న వాహనం పట్టుకుని మంగళవారం పోలీస్ స్టేషన్కు తరలించారు. హిందూపురం మండలం కొటిపి గ్రామం నుంచి కర్నాకటకు చౌకధాన్యంను సోమందేపల్లి గ్రామానికి చెందిను రామకృష్ణ అనే వ్యక్తి టాటాఏస్ లో తరలిస్తుండగా రూరల్ సీఐ కృష్ణారెడ్డి పట్టుకున్నారు. వాహనాలు తనికీ చేస్తుండగా 50 కేజీల బియ్యం పాకెట్లు 25 సంచుల్లో బియ్యం దొరికింది. అయితే అతను కొటిపి పరిసర గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి కర్నాటకాకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముకుంటాడని తెలిసింది. బియ్యం వ్యాపారిని అదుపులోనికి తీసుకొని వాహనం సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.