జాతీయ సమైక్యతా శిబిరంకు హిందూపురంకు చెందిన బాలయేసు విద్యార్థిని భార్గవి ఎంపికైనట్లు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మురళిధర్ రావు తెలిపారు. ఎస్కే యూనివర్సీటీ తరపున 5 మంది ఎంపిక కాగా హిందూపురం నుంచి బాలయేసు విదార్థిని భార్గవి, ఎన్డీఎస్ కళాశాల విద్యార్థిని ఇద్దరు అర్హత సాధించారన్నారు. వీరు ఈ నెల 15వ తేదీ నుంచి 21 వరకు జరుగు జాతీయ స్థాయి సమైక్యతా శిభిరంలో పాల్గొంటారని ప్రోగ్రాం ఆఫీసర్ పేర్కొన్నారు. భార్గవిని ప్రిన్సిపాల్ శ్రీనాథెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ అశ్వర్థనారాయణ, రఘు, రమేష్, హరీష్ తదితరులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa