పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి తమ మద్దతు ప్రకటించినట్లు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంఘం( పీటీఎల్ యూ ) మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ గడ్డం రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటయ్య తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు స్థానిక ఉపాధ్యాయ సేవా కేంద్రంలో ఒంటేరు శ్రీనివాసులరెడ్డిని వారు కలిసి మద్దతు పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో డిసిఈబి విశ్రాంత సెక్రటరీ కేశవరెడ్డి, శ్రీనివాసులు, నరేంద్రనాథ్ రెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.